రంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక మాడ్యూల్ ఇండస్ట్రీస్‌లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.