తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తుది ఓటర్ జాబితా విడుదల.. మొత్తం ఓటర్ల సంఖ్య 3, 17, 17, 389.. వివరాలు ఇవే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల తుది జాబితా విడుదలను ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3, 17, 17, 389 మంది ఓటర్లు ఉన్నట్టుగా ఎన్నికల సంఘం తెలిపింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల తుది జాబితా విడుదలను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3, 17, 17, 389 మంది ఓటర్లు ఉన్నట్టుగా ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో పురుష ఓటర్లు- 1,58,71,493 మంది, మహిళా ఓటర్లు- 1,58, 43, 339 మంది, ట్రాన్స్ జెండర్ ఓటర్లు- 2, 557 ఉన్నారు. ఇక, సర్వీస్ ఓటర్లు- 15, 338 మంది, ప్రవాస ఓటర్లు- 2, 780 మంది ఉన్నారు. రాష్ట్రంలో కొత్త ఓటర్ల సంఖ్య 17.01 లక్షలుగా ఉంది. రాష్ట్రంలో తొలగించిన ఓట్ల సంఖ్య 6.10 లక్షలుగా ఉంది.