జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని అంబారీపేటలో కన్న తండ్రే తన బిడ్డలను చంపేందుకు ప్రయత్నించాడు. మధ్యాహ్నం ఆదమరిచి నిద్రిస్తున్న పిల్లలపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఈ దాడిలో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు పిల్లలను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబకలహాల కారణంగానే నిందితుడు దాడికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.