Siddipet: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కృషితో రాష్ట్ర రైతాంగం సంతోషంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తూ.. ప్ర‌జా సంక్షేమం కోసం అన్ని రకాల చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని పేర్కొన్నారు. 

Telangana Finance Minister T. Harish Rao: బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తూ.. ప్ర‌జా సంక్షేమం కోసం అన్ని రకాల చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) పాల‌న‌లో రాష్ట్ర రైలులు ఎంతో సంతోషంతో ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు. 

వివ‌రాల్లోకెళ్తే.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు (కేసీఆర్) కృషితో రాష్ట్ర రైతాంగం సంతోషంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. చిన్నకొడుకుకు కనిపించకపోయినా సీఎం కేసీఆర్ పెద్దకొడుకులా కుటుంబానికి పింఛన్ ఇస్తున్నారని ప్ర‌శంస‌లు కురిపించారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చర్ల అంకిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో కరెంట్, ఎరువుల కొరత తీవ్రంగా ఉండేదన్నారు. 

ప్ర‌స్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తోందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులను కేసీఆర్ ప్రభుత్వం ఆదుకుందన్నారు. రైతుబంధు పథకం ద్వారా రైతులను ఆదుకుంటున్నామని చెప్పారు. రంగనాయక సాగర్ జలాశయం నుంచి కాలువల ద్వారా చెరువులను నింపి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నామన్నారు. రైతాంగం కోసం అనేక చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు. 

కాగా, 2023-2024 బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం ఆమోదం తెలపనుంది. నిరుద్యోగ భృతి పథకం అమలుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని తెలిసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి కింద రూ.3వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. చదువుకున్న నిరుద్యోగ యువతకు నెలనెలా సాయం అందిస్తామన్న హామీని నెరవేర్చాలని ప్రతిపక్షాలు సీఎంను డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 

ఎన్నికల సంవత్సరం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ప్రాధాన్యతలపై చర్చించేందుకు సీఎం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మొత్తం వ్యయం రూ.2.8 లక్షల కోట్ల నుంచి రూ.2.95 లక్షల కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఎక్కువ నిధులు సంక్షేమ పథకాలకే కేటాయిస్తామన్నారు. దళిత బంధు పథకానికి మరిన్ని కేటాయింపులు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.