హైదరాబాద్‌లో నకిలీ టెలీకాల్ సెంటర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఈ ముఠా మోసం చేస్తోంది. ఈ సందర్భంగా రూ.కోటి విలువైన వస్తువులతో పాటు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. 

హైదరాబాద్‌లో నకిలీ టెలీకాల్ సెంటర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. 21 మందిని అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారిని టార్గెట్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఈ ముఠా మోసం చేస్తోంది. ఈ సందర్భంగా రూ.కోటి విలువైన వస్తువులతో పాటు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇక మరో కేసులో మల్కాజ్‌గిరిలో రూ.66 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. సీలేరు నుంచి హైదరాబాద్ మీదుగా హర్యానాకి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.