Extra Marital Affair: అక్రమ సంబంధాల కారణంగా ఇటీవలి కాలంలో నేరాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పట్టుకున్న ఒక ప్రేమ జంట హత్యకు గురైంది. వీరిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు.
Love Couple Murder At Adilabad: అక్రమ సంబంధాల కారణంగా ఇటీవలి కాలంలో నేరాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పట్టుకున్న ఒక ప్రేమ జంట హత్యకు గురైంది. వీరిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ హత్యల గురించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు, వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా కొట్టి ప్రాణాలు తీశారు. గుడిహత్నూర్ లో వెలుగులు చూసిన జంట హత్యలపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు.సీతగోంది గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమిలో ప్రేమ జంట విగతజీవులుగా కనిపించడాన్ని స్థానికులు చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కేసు నమోదు.. విచారణ ప్రారంభం
హత్యకు గురైన వారిని ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మహ్మద్ రఫిక్, అశ్వినిగా పోలీసులు గుర్తించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ జంట హత్యలు రెండు-మూడు రోజుల క్రితం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కేసు నమోదుచేసుకున్నామనీ, దీనిపై లోతైన విచారణ జరుగుతున్నదని తెలిపారు.
సీసీటీవీలో రికార్డు.. లొంగిపోయిన భర్త..
ఈ జంట హత్యలకు ముందు ఇద్దరు కలిపి స్కూటీ మీద వెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రఫిక్ బైక్ నడుపుతుండగా అశ్విని వెనుక కూర్చొని ఉంది. ఆ తర్వాత వీరు దారుణంగా హత్యకు గురయ్యారు. అలాగే, హత్య చేసినవారిని గుర్తించడంలో పలు అధారాలు అభ్యమయ్యాయి. ఈ హత్యల నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ హత్యలకు పాల్పడింది తానేనని అశ్విని భర్త అంగీకరించినట్టు సమాచారం. భార్య వివాహేతర సంబంధం కారణంతో అశ్విని, ఆమె ప్రియుడిని హత్య చేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నాడని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
