వివాహేతర సంబంధం : దుబాయ్ నుంచి రహస్యంగా వచ్చి.. భార్య, ప్రియుడిని కత్తితో పొడిచి హత్య...
భార్యపై అనుమానంతో రహస్యంగా దుబాయ్ నుంచి సొంతూరుకు వచ్చిన ఓ వ్యక్తి.. భార్యను ఆమె ప్రేమికుడిని హత్య చేశాడు.

సిరిసిల్లా : భార్యపై అనుమానం ఓ వ్యక్తిని హంతకుడిని చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా స్వగ్రామానికి వచ్చాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తన ఇంట్లో భార్యను హత్య చేసేందుకు పథకం వేశాడు. భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని అనుమానించాడు.
అతను అనుకున్నట్లే ఇంటికి చేరుకుని రహస్యంగా దాక్కున్నాడు. భార్య ప్రేమికుడు వచ్చేదాక ఓపికగా ఎదురు చూశాడు. ఆ తరువాత ఇద్దరిని పట్టుకుని కత్తితో పొడిచి చంపాడు. నిందితుడు మల్లేష్ (30), బాధితుడు పి నరేష్ (25) ఇద్దరూ దుబాయ్‌లో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ చంద్రుతి మండలం మల్యాల గ్రామ వాసులే.
మల్లేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతను దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు లుక్-అవుట్ సిరుక్లర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నరేష్‌కు మల్లేష్ భార్యతో కొంతకాలంగా అక్రమ సంబంధం ఉంది.
మహిళకు భర్త మల్లేష్.. 9, 3 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. 10 రోజుల క్రితం నరేష్ తన గ్రామానికి వచ్చాడు. మల్లేష్ ఇంకా దుబాయ్‌లో ఉన్నాడని నమ్మి తరచూ మహిళ వద్దకు వస్తున్నాడు.
అయితే వీరిద్దరిపై మల్లేష్ అనుమానం వచ్చి రహస్యంగా అతను కూడా దుబాయ్ నుంచి గ్రామానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి అతడికి ఇద్దరినీ పట్టుకునే అవకాశం వచ్చింది. నరేష్‌పై మల్లేష్ కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.