ఇప్పటికే పలచన అయ్యాం.. ఇంకా నష్టం కలిగించొద్దు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించొద్దని కార్యకర్తలకు సూచించారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ షేక్ అయ్యేలా పోరాటం చేద్దామని పొంగులేటి పిలుపునిచ్చారు.

పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించొద్దని కార్యకర్తలకు సూచించారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మంగళవారం జరిగిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. మనం ఇప్పటికే పలుచన అవుతున్నామని, ఇంకా పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరించవద్దని కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ షేక్ అయ్యేలా పోరాటం చేద్దామని పొంగులేటి పిలుపునిచ్చారు.
ఇదే సమావేశంలో రేణుకా చౌదరి మాట్లాడుతూ.. 30, 40 ఏళ్లు పనిచేసిన వాళ్లకి కాంగ్రెస్‌లో గుర్తింపు రాలేదన్నారు. తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని.. ఇలాంటి పరిస్ధితి వల్ల అన్యాయం జరిగే అవకాశం వుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, కేసీఆర్ వేరు వేరు కాదని.. రాబందులు చాలా మంది వున్నారని రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు సవాల్ విసిరారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు.