Asianet News TeluguAsianet News Telugu

తొలి తరం తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆమోస్ మృతి

ప్రముఖ తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి తెలంగాణ మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి సంతాపం ప్రకటించారు. 

EX MLC and Telangana leader dies due to illhealth
Author
Hyderabad, First Published Oct 10, 2019, 10:30 PM IST

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ కె,ఆర్. ఆమోస్ కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాదులోని మల్కాజిగిరిలో గల తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన సర్వీసు నుంచి డిస్మిస్ అయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన నేతల్లో తొలిసారి ప్రభుత్వోద్యోగం కోల్పోయిన నేత ఆయన.

సీనియర్ తెలంగాణ ఉద్యమ నాయకులు ప్రముఖ తెలంగాణ వాది,  టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ   కెఆర్ ఆమోస్ మృతిపట్ల మంత్రి కేటీ రామారావు తీవ్ర సంతాపం ప్రకటించారు. 1969లో తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యోగ సంఘాలను ఏకతాటిపై నడిపించిన ఆయన తర్వాతి దశాబ్దాల్లోనూ తన పోరాటాన్ని కొనసాగించారన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి ఆమోస్ చేసిన సేవలను మంత్రి కేటీఆర్ గుర్తు తెచ్చుకున్నారు. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంతో పాటు,  తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాల పైన సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఆయన నిరంతరం గళమెత్తుతూ ఉండేవారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరారన్నారు. తెలంగాణ సమాజానికి ఆమోస్ చేసిన సేవలు ఎల్లకాలం గుర్తు ఉంటాయని ఆయన మృతి తెలంగాణ కి తీరని లోటన్నారు. ఆమోస్ కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సీనియర్ తెలంగాణ ఉద్యమ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. 1969 తెలంగాణ ఉద్యమంతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆమోస్ పాత్ర మరవలేనిదని అన్నారు. 

అమోస్ మరణం తెలంగాణ రాష్ట్రం లో పూడ్చలేనిదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి  అన్నారు. తొలి తెలంగాణ ఉద్యమంలో ఉద్యగవర్గాలను ఏకం చేసిన దివంగత అమోస్ మలి దశ ఉద్యమానికి మార్గదర్శి అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి  అన్నారు.

మాజీ ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ మృతి పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆమోస్ మృతి తెలంగాణ కు తీరని లోటు అని వినోద్ కుమార్ అన్నారు .ఆమోస్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తెలంగాణ ఉద్యమ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ  కెఆర్ ఆమోస్ మృతి పట్ల అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. 1969 నుంచి తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం చేశారన్నారు. అమోస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

 కె అర్ అమోస్ మృతి పట్ల  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిసంతాపం ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన నాయకులని ఆమె అన్నారు .ఆయన మృతి తెలంగాణ కు తీరని లోటు అని అన్నారు.

తెలంగాణ ఉద్యమ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ మృతి పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సంతాపం వ్యక్తం చేశారు.  తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆమోస్ ఎనలేని కృషి చేశారని మంత్రి పేర్కొన్నారు. ఆమోస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios