ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరాబాద్‌కు చేరుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ గూటికి చేరారు.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరాబాద్‌కు చేరుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ గూటికి చేరారు. మల్లికార్జున ఖర్గే స్వయంగా తుమ్మలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తుమ్మల శాలువతో ఖర్గేను సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.
ఇక, బీఆర్ఎస్ నుంచి పాలేరు టికెట్ దక్కకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తికి లోనైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ అధిష్టానం వైఖరిపై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో చేరాలని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు తుమ్మలను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే తన అనుచరులు, సన్నిహితులతో చర్చించిన తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్ గూటికి చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఈరోజు బీఆర్ఎస్‌కు తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపారు. బీఆర్ఎస్‌లో తనకు సహకరించిన వారికి తుమ్మల ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.