మాజీ మంత్రి రాజయ్య మృతి
ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక, గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన మల్యాల రాజయ్య ఇవాళ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రిలో ఈయన చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రాజయ్య మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఉమ్మడి మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గానికి రాజయ్య రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1985 లో టిడిపి పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ మాజీ డిప్యూటి సీఎం దామోదర రాజనర్సింహ తండ్రి రాజనర్సింహపై గెలుపొందారు. ఆ తర్వాత 1989 కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ చేతిలో ఓటమిపాలయ్యారు. మళ్లీ 1994 లో దామోదర రాజనర్సింహ పై భారీ మెజారిటీతో గెలుపొందారు. 1997 లో సిద్దిపేట ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్ లో అడుగుపెట్టారు.
కేవలం ఎమ్మెల్యేగానే కాకుండా ఎన్టీఆర్ మంత్రివర్గంలో కీలక ఆర్థిక మరియు గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో తెలంగాణలో ముఖ్య నేతగా పేరుతెచ్చుకున్న ఆయన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తో సన్నిహితంగా మెలిగేవారు. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత దేవేందర్ గౌడ్ ఏర్పాటుచేసిన పార్టీలో కూడా పనిచేశారు.
అనంతరం ఆయన యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల తీవ్ర అనారోగ్యంతో అపోలో చికిత్స పొందుతున్న రాజయ్య ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. ఈయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.