Asianet News TeluguAsianet News Telugu

పంచాయితీ ఎన్నికలపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో ప్రభుత్వం బిసి రిజర్వేషన్లను తగ్గించడాన్ని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తప్పుబట్టారు. కోర్టు తీర్పును సాకుగా చూపించి బిసిలకు టీఆర్ఎస్ సర్కారు అన్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో బలహీన వర్గాల ప్రజలు తమకు అన్యాయం జరుగుతోందని ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని జీవన్ రెడ్డి అన్నారు.
 
ex congress mla jeevan reddy comments on panchayath elections
Author
Hyderabad, First Published Jan 3, 2019, 8:47 PM IST

తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో ప్రభుత్వం బిసి రిజర్వేషన్లను తగ్గించడాన్ని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తప్పుబట్టారు. కోర్టు తీర్పును సాకుగా చూపించి బిసిలకు టీఆర్ఎస్ సర్కారు అన్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో బలహీన వర్గాల ప్రజలు తమకు అన్యాయం జరుగుతోందని ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని జీవన్ రెడ్డి అన్నారు.

రిజర్వేషన్లు తగ్గించి బిసిలను మోసం చేస్తే...అధికారులను వాడుకుని ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు మోసం చేస్తోందని జీవన్ రెడ్డి అన్నారు. అధికారులు కండువాలు లేని టీఆర్ఎస్ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గాల్లోని గ్రామాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పినట్లుగానే అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారని...నిబందనలను పాటించడం లేదని ఆరోపించారు. 

జగిత్యాల జిల్లాలో పలు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీలకు పోటీచేసే అవకాశం రావాల్సి వుండగా అధికారులు ఇతరులకు అవకాశం కల్పించాలన్నారు. గ్రామాల రిజర్వేషన్లను  ప్రకటించడంలో అవకతవకలు జరుగుతున్నట్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. అధికారులు ఇలా అధికార పార్టీకి సపోర్ట్ చేస్తూ నిబంధనలు పాటించకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిదికాదని జీవన్ రెడ్డి హెచ్చరించారు.   

Follow Us:
Download App:
  • android
  • ios