కొడంగల్: తెలంగాణ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికర నియోజకవర్గం కొడంగల్. ఈ ఎన్నికల్లో కొడంగల్ పోలింగ్ సరళిపై సర్వత్రా ఆసక్తిగా తిలకిస్తున్నారు. అయితే కొడంగల్ నియోజకవర్గం ముఖ్యకేంద్రం అయిన కొడంగల్ లో ఈవీఎంలు మెురాయించాయి. 

దీంతో ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఎన్నికలు 20 నిమిషాలు ఆలస్యంగా మెుదలైంది. ఆ తర్వాత ప్రారంభమైనా మళ్లీ కాసేపటికే మెురాయించాయి. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు మెరాయిస్తున్నాయి. దీంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.