తెలంగాణ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల తరపున వారి భార్యలు, కూతుళ్లు, కొడుకులు, కోడళ్లు రంగంలోకి దిగి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేత, మంత్రి ఈటల రాజేందర్ భార్య, కోడలు ఆయన తరపున ప్రచారం చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బ్రాహ్మణపల్లి, బొంతుపల్లి, కిష్టంపేట, దేశాయిపల్లి, మల్లారెడ్డిపల్లి గ్రామాల్లో ఈటల సతీమణీ జమున, కుమారుడు నితిన్, కోడల క్షమిత ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పథకాలను నిరుపేదలకు అందే విధంగా ఈటల కృషి చేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మరోసారి ఆయనకు అవకాశం కల్పించి హుజూరాబాద్‌ను ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, ఈటల అభిమానులు పాల్గొన్నారు. 

"