Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ రైతులకు ధోకా లేదు, ఎందుకంటే...: ఈటల రాజేందర్ (వీడియో)

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లా మొత్తం జల కళను సంతరించుకుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో రైతులు ఇక సాగు నీటి కోసం హైరానా పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇవాళ మంత్రి ఈటల జిల్లా కలెక్టర్, పార్టీ ఎమ్మెల్యేలతో, ముఖ్యమైన ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.   అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... వర్షాలు ఈ సీజన్ మధ్యలో కాస్త ఆందోళన కల్గించినా చివరకు ఆగస్ట్ లో సమృద్దిగా కురుస్తున్నాయన్నారు. ఇందులో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో మంచి వర్షపాతం నమోదయ్యిందని, వాగులు,వంకలు పూర్తిగా నిండి జలకళను  సంతరించుకోగా, భూగర్భజల మట్టం కూడా పెరిగిందని మంత్రి వివరించారు. 
 
etela rajendar press meet about rains
Author
Karimnagar, First Published Aug 18, 2018, 10:46 AM IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లా మొత్తం జల కళను సంతరించుకుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో రైతులు ఇక సాగు నీటి కోసం హైరానా పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇవాళ మంత్రి ఈటల జిల్లా కలెక్టర్, పార్టీ ఎమ్మెల్యేలతో, ముఖ్యమైన ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.   అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... వర్షాలు ఈ సీజన్ మధ్యలో కాస్త ఆందోళన కల్గించినా చివరకు ఆగస్ట్ లో సమృద్దిగా కురుస్తున్నాయన్నారు. ఇందులో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో మంచి వర్షపాతం నమోదయ్యిందని, వాగులు,వంకలు పూర్తిగా నిండి జలకళను  సంతరించుకోగా, భూగర్భజల మట్టం కూడా పెరిగిందని మంత్రి వివరించారు. 

వీడియో

"

Follow Us:
Download App:
  • android
  • ios