జనగామ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోలుపై మంత్రి ఎర్రబెల్లి దాకా రావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అలసత్వం వహించరాదని పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అకాల వర్షాలు, పంటల నష్టాలు, ధాన్యం కొనుగోలు వంటి పలు అంశాల మీద మంత్రి ఎర్రబెల్లి దయాకర్ జనగామ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… ఇటీవల వడగళ్ల వర్షం పంట నష్టపోయిన రైతులకు తక్షణమే వివరాలు సేకరించాలని సూచించారు. దెబ్బ తిన్న పంటల నష్టాలను వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలనీ, నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలని ఆదేశించారు. రైతుల పంటలను ప్రభుత్వం పరంగా ఆఖరు గింజ వరకు కొనుగోలు చేయాలనీ, మక్కలను కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సీఎం కెసిఆర్ నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయాలని, మక్కల కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కొనుగోలులో అలసత్వం వహించకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ఎగుమతి చేయాలన్నారు. అందుకు ట్రాన్స్ ఫోర్ట్ సక్రమంగా కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని రైతులకు ఎలాంటి నష్టం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జనగామ జడ్పీ చైర్మన్ పాకాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, సంబంధిత శాఖల అధికారులు, ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
