కాంగ్రెస్‌కు షాక్: బీఆర్ఎస్‌లో చేరిన ఎర్ర శేఖర్
జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఇవాళ బీఆర్ఎస్ లో చేరారు. జడ్చర్ల నుండి కాంగ్రెస్ టిక్కెట్టు ఆశించారు ఎర్ర శేఖర్.
హైదరాబాద్: జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆదివారంనాడు బీఆర్ఎస్ లో చేరారు. జడ్చర్ల నుండి కాంగ్రెస్ టిక్కెట్టును ఎర్ర శేఖర్ ఆశించారు. అయితే ఎర్ర శేఖర్ కు కాంగ్రెస్ టిక్కెట్టు దక్కలేదు.దీంతో ఎర్ర శేఖర్ కాంగ్రెస్ ను వీడారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎర్ర శేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుండి ఎర్ర శేఖర్ మూడు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జడ్చర్ల నుండి మూడు దఫాలు టీడీపీ అభ్యర్ధిగా ఎర్ర శేఖర్ విజయం సాధించారు.
also read:కారణమిదీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం
జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుండి అనిరుద్ రెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్టు కేటాయించింది. దీంతో అసంతృప్తికి గురైన ఎర్ర శేఖర్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ లో చేరడానికి ముందు ఆయన బీజేపీలో ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కూడ ఆయన పనిచేశారు. బీజేపీలో స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎర్ర శేఖర్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఎర్ర శేఖర్ కాంగ్రెస్ లో చేరారు .బీజేపీలో చేరడానికి ముందు ఆయన టీడీపీలో ఉన్నారు. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఎర్ర శేఖర్ టీడీపీని వీడి బీజేపీలో చేరారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు గణనీయంగా ఉంటారు. ఎర్ర శేఖర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట, జడ్చర్ల , నాగర్ కర్నూల్ , గద్వాల వంటి అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ టిక్కెట్టు ఆశించిన కొందరు నేతలు అసంతృప్తితో పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారు. టిక్కెట్టు దక్కని నేతలు తమ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఈ దఫా అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేస్తుంది. మూడో దఫా తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ పావులు కదుపుతుంది. తెలంగాణలో తొలిసారిగా అధికారాన్ని దక్కించకోవాలని బీజేపీ వ్యూహలు రచిస్తుంది.
టిక్కెట్లు దక్కని నేతలు పార్టీలు మారుతున్నారు. బీజేపీ మాత్రం ఇంకా సగం అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సి ఉంది. ఇతర పార్టీలకు చెందిన అసంతృప్తులు తమ వైపునకు వచ్చే పరిస్థితి ఉంటుందని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. దీంతో అభ్యర్థుల జాబితా విడుదల చేయడంలో ఆ పార్టీ ఆలస్యం చేస్తుంది.