సిరిసిల్ల జిల్లాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య విషాదాన్ని నింపింది. ఎంతో కష్టపడి చదివినా పరీక్షలు బాగా రాయకపోవడంతో ఫెయిల్ అవుతానని భావించిన విద్యార్థిని కఠిన నిర్ణయం తీసుకుంది. పరీక్షలో ఫెయిల్ అవుతానన్న భయంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  సిరిసిల్ల అర్బన్ మండలం చంద్రంపేట గ్రామంలో నివసించే బాలకిషన్,అనిత దంపతులకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. భార్యాభర్తలిద్దరు ఎంతో కష్టపడుతూ ఇద్దరిని చదివిస్తున్నారు.

వీరి కూతురు శ్రీవాణి(18) ఇంటర్మీడియట్ లో మంచి ప్రతిభ కనబర్చి మంచి మార్కులతో పాసయ్యింది. దీంతో తల్లిదండ్రులు చదివించడం కష్టమైనప్పటికి కూతురు భవిష్యత్ భావుంటుందని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. గత సంవత్సరమే కరీంనగర్ లో ఓ  ప్రైవేట్ కాలేజిలో చేర్పించారు.  

 ఇటీవలే సెమిస్టర్ పరీక్షలు ముగించుకున్న శ్రీవాణి కాలేజికి సెలవులు ఉండటంతో ఇంటికి వచ్చింది. అయితే పరీక్షలు భాగా రాయలేకపోవడంతో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దారుణానికి పాల్పడింది. ప్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 

ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  తల్లిదండ్రులు, తోటి విద్యార్ధులను ఆ ఆత్మహత్యపై విచారించి చదువుల ఒత్తిడితోనే శ్రీవాణి బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.