Asianet News TeluguAsianet News Telugu

ఈవీఎంల మొరాయింపుతో హైడ్రామా: కోదాడలో ఉత్తమ్ భార్య ఓటమి

కోదాడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని ప్రకటించకుండా నిలిపివేశారు.మూడు గ్రామాల ఈవీఎంలు మొరాయించాయి. చివరకు ఈ మూడు గ్రామాల ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడంతో ఉత్తమ్ భార్య పద్మావతి ఓటమి పాలయ్యారు.

election officers stopped kodada election results
Author
Hyderabad, First Published Dec 11, 2018, 7:18 PM IST

కోదాడ:కోదాడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని ప్రకటించకుండా నిలిపివేశారు.మూడు గ్రామాల ఈవీఎంలు మొరాయించాయి. ఈ విషయమై వీవీప్యాట్‌‌ స్లిప్పుల ఆధారంగా ఓట్లను లెక్కించాలని  కలెక్టర్ నిర్ణయం తీసుకొన్నారు.ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డి వ్యతిరేకించారు.

ఇప్పటివరకు  ఉన్న జరిగిన ఓట్ల లెక్కింపులో 1089 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. అయితే  ఖానాపురం, సిరిపురం, రాఘవపురం  గ్రామాలకు చెందిన ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఈ ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పుల ఆధారంగా ఓట్లను లెక్కించాలని కలెక్టర్ నిర్ణయం తీసుకొన్నారు.

ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి వ్యతిరేకించారు.2300 ఓట్లు ఈ మూడు గ్రామాల్లో ఉన్నాయి. ఒక్క గ్రామంలో జరిగిన ఓట్ల లెక్కింపులో 85 ఓట్ల ఆధిక్యంలో  పద్మావతి ఆధిక్యాన్ని సాధించారు. మిగిలిన 1300 ఓట్లను లెక్కించాల్సి ఉంది.

అయితే  ఈ నియోజకవర్గంలో  మూడు ఈవీఎంలే కాదు మొత్తం కౌంటింగ్ నిర్వహించాలని  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి కోరుతున్నారు.ఈ విషయమై ఆమె ఈసీని కోరారు. ఈ విషయమై సీఈసీ రజత్ కుమార్ లేదా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన అవసరం ఉందని  కలెక్టర్ చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి అభ్యర్థన మేరకు కోదాడ ఫలితాన్ని నిలిపివేశారు.

అయితే రీ కౌంటింగ్ కు ఈసీ ఒప్పుకోలేదు. ఈ మూడు ఈవీఎంల లెక్కించడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ సతీమణి పద్మావతి టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios