ECI : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈసీ ఎన్‌రోల్‌మెంట్ ప్రచారం..

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్ రోల్ మెంట్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్టు ఈసీఐ వ‌ర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లో బూత్ లెవల్ ఆఫీస్ సూపర్ వైజర్లు, నోడల్ అధికారులు ప్రచారం చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి వారి ట్రైనింగ్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. 
 

ECI : Election Commission enrolment campaign ahead of Telangana Assembly elections RMA

Telangana assembly polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు భార‌త ఎన్నిక‌ల సంఘం అన్ని ఏర్పాట్ల‌ను సిద్ధం చేస్తోంది. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంద‌నీ, దీని కోసం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఆగస్టు 5 నుంచి 16వ తేదీ వరకు ఈ క్యాంపెయిన్ జరగనుంది. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (ఆర్ డబ్ల్యూఏ) అత్యున్నత సంస్థ యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (యూఎఫ్ ఆర్ డబ్ల్యూఏఎస్ ), హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ (హైఎస్ ఈఏ)లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్ రాజ్ ఇప్ప‌టికే సమావేశమయ్యారు.

బూత్ లెవల్ ఆఫీస్ (బీఎల్ వో) సూపర్ వైజర్లు, నోడల్ అధికారులు అన్ని ఆర్ డబ్ల్యూఏల్లో ప్రచారం చేపట్టనున్నారు. బీఎల్ వో సూపర్ వైజర్లు ఆర్ డబ్ల్యూఏలను సందర్శించి కొత్త నమోదులు, ఓటర్ల జాబితా నమోదుల్లో సవరణలు తదితరాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారని సంబంధిత అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి వారి ట్రైనింగ్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఆన్లైన్ ఓటరు జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవడం తప్పనిసరి.

ఓటర్ల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి.. 

  • ముందుగా, సీఈవో తెలంగాణ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. 
  • సెర్చ్ యువ‌ర్ నేమ్ అనే లింక్ పై క్లిక్ చేయండి. 
  • 'ఓటరు జాబితాలో మీ పేరును సెర్చ్ చేయండి' పై క్లిక్ చేసిన త‌ర్వాత ఒక ట్యాబ్ ఒపెన్ అవుతుంది. 
  • పేరు, పుట్టిన తేదీ, అసెంబ్లీ నియోజకవర్గంతో సహా మీ ప్రాథమిక వివరాలను నింపండి.
  • వివరాలు సమర్పించిన తర్వాత ఓటరు సమాచారం ఓటరు జాబితాలో ఉంటే మీ వివ‌రాల‌ను స్క్రీన్ పై చూపిస్తుంది. 
  • ఓటరు జాబితాలో పేరు గల్లంతైనా, ఓటర్ల జాబితాలో నమోదులు తప్పుగా ఉన్నా సంబంధిత దరఖాస్తును ఆన్ లైన్ లో కూడా ఈసీఐకి సమర్పించవచ్చు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..

తెలంగాణలో ఈ ఏడాది చివర్ లో 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలుగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఎంఐఎంలు పోటీ ప‌డ్డాయి. ఎన్నికల అనంతరం 119 స్థానాలకు గాను 88 స్థానాల్లో విజయం సాధించి టీఆర్ఎస్ (ప్ర‌స్తుతం బీఆర్ఎస్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సీట్ల వాటా 21 నుంచి 19కి పడిపోగా, ఎంఐఎం ఏడు స్థానాలను గెలుచుకోగలిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి రాజాసింగ్ విజయం సాధించడంతో ఒక్క సీటును మాత్రమే దక్కించుకోగలిగింది. బీజేపీ సీట్ల వాటా ఐదు నుంచి ఒకటికి పడిపోయింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios