Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో ఈసీ తనిఖీలు...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ధన, మద్య ప్రవాహంతో పాటు అక్రమాలను అరికట్టడానికి పోలీసులు, ఈసి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై, వివిద పట్టణాల వద్ద, రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక చెక్స్ పోస్టులు ఏర్పాటుచేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను కూడా వదలకుండా వాటిని కూడా తనిఖీ చేశాకే వదిలిపెడుతున్నారు. ఇక ఎవరైనా ఓటర్లను ప్రలోభపెడుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందింతే ఈసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఇలా అందిన సమాచారం మేరకు ఈసీ అధికారులు ఓ టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో తనిఖీలు చేపట్టారు.

ec officers searched in trs leader home at  mahabubabad
Author
Mahabubabad, First Published Nov 28, 2018, 2:49 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ధన, మద్య ప్రవాహంతో పాటు అక్రమాలను అరికట్టడానికి పోలీసులు, ఈసి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై, వివిద పట్టణాల వద్ద, రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక చెక్స్ పోస్టులు ఏర్పాటుచేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను కూడా వదలకుండా వాటిని కూడా తనిఖీ చేశాకే వదిలిపెడుతున్నారు. ఇక ఎవరైనా ఓటర్లను ప్రలోభపెడుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందింతే ఈసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఇలా అందిన సమాచారం మేరకు ఈసీ అధికారులు ఓ టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో తనిఖీలు చేపట్టారు.

మహబూబాబాద్ టీఆర్ఎస్ నేత శివకుమార్ ఇంట్లో భారీగా డబ్బులున్నాయని ఎలక్షన్ కమీషన్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు స్థానిక పోలీసుల సహాయంలో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాల్లో కేవలం రూ.1,23,000వేల రూపాయలు మాత్రమే ఈసీ అధికారులకు దొరికాయి. దొరికిన డబ్బుకు కూడా సంబంధించిన లెక్కలు వుండటంతో అధికారులు వెనుదిరిగారు. 

తన ఇంట్లో జరిగిన తనిఖీలపై శివకుమార్ స్పందిస్తూ...తనంటే గిట్టనివారో, ప్రత్యర్థులో ఈసికి తప్పుడు సమాచారం అందించి ఉంటారన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులెవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడటం లేదని శివకుమార్ తెలిపారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios