మంత్రి కేటీఆర్ నిన్న మాట్లాడిన మాటలే హుజురాబాద్ లో తన గెలుపును ఖరారు చేసాయని మాజీ మంత్రి,బిజెపి నాయకులు ఈటల రాజేందర్ అన్నారు. 

కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు ఆయన జేజమ్మ కూడా మార్చలేదని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ అన్నారు. తల కిందికి కాళ్ళు పైకి పెట్టినా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు ఈటల. 

''మంగళవారం మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలే నా గెలుపును ఖరారు చేసాయి. గత మూడు నెలలుగా స్వయంగా కేసీఆర్ నాయకత్వంలో హరీష్ రావు సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గొర్ల మంద మీద తోడేళ్ళు పడ్డట్టు పడ్డారు. సొంత పార్టీ నాయకులకు ఖరీదు కట్టి చిల్లర పనులు చేసి అభాసుపాలయ్యారు'' అని అన్నారు. 

''అధికారంలోకి వచ్చిన ఏడు సంవత్సరాల్లో సీఎం జగన్ ఒక్కసారి కూడా అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాం విగ్రహనికి పూల మాల వేయలేదు. నా రాజీనామా వల్ల హుజూరాబాద్ ప్రజానీకానికి ఎన్ని లాభాలు జరిగాయో మొత్తం రాష్ట్రానికి అవే లాభాలు జరగాలి. నా రాజీనామాతో హుజూరాబాద్ కు సంక్షేమ పథకాలు వస్తున్నందుకు సంతోషిస్తున్నా. దళిత బంధు కేవలం హుజూరాబాద్ లోనే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అమలుచేయాలి. కేవలం దళితులకే కాదు అన్ని కులాల నిరుపేదలకు ఆర్థిక సాయం చేయాలి'' అని ఈటల డిమాండ్ చేశారు. 

read more అరెస్ట్ చేయమంటారా... కోటి రూపాయలు ఇస్తారా: మంత్రి గంగులకు సైబర్ నేరగాళ్ల బెదిరింపు

''నేను చెప్పడం వల్లే ఇంటెలిజెన్స్ చీఫ్ ను మార్చారు. కేసీఅర్ మాటలను దళితులు ఎవరు నమ్మడం లేదు. దళిత బంధుతో పాటు ఇంకెన్ని పథకాలు ప్రవేశపెట్టినా హుజురాబాద్ లో రాజేందర్ నే గెలిపిస్తమని ప్రజలు అంటున్నారు. సర్వేలు కూడా చెపుతున్నదిదే. హుజూరాబాద్ లో ఓడిపోతామనే భయం నిన్న కెటిఆర్ మాటల్లో కనిపించింది'' అని అన్నారు. 

''ఎవరి స్థలాల్లో వాళ్లకే డబుల్ బెడ్ రూం ఇస్తామని ప్రభుత్వం జీఓ విడుదల చేయాలి. సిఎంఓ ఆఫీసులో బిసి, మైనారిటీ అధికారులను కూడా నియమించాలి. తెలంగణ వ్యాప్తంగా హుజూరాబాద్ లో ఎందుకు ఇంత నిర్భందం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇటువంటి చర్యలు వెంటనే అపాలి'' అని డిమాండ్ చేశారు. 

''ఒక చిన్న కార్యకర్తతో కూడా మాట్లాడే స్థాయికి దిగజారిండు కేసీఅర్. హుజూరాబాద్ లో ఉన్న నాయకుల మీద నమ్మకం లేక సిద్దిపేట నాయకులను పిలిపించారు. స్థానిక నాయకులు ఇన్ని అవమానాలు భరించవలసి అవసరం ఉందా... ఇప్పటికైనా అలోచించండి?'' అని ఈటల కోరారు. 

''హుజూరాబాద్ ప్రజలు ప్రేమతో లొంగుతారు తప్ప భయానికి లొంగరు. స్వయంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు ప్రజలకు దావత్ ఇస్తున్నారు. టీఆర్ఎస్ చేసే పనులకు రాజకీయం సిగ్గుతో తల దించుకుంటుంది. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ ఆత్మ గౌరవం అని భావిస్తున్నారు.హుజూరాబాద్ లో గెలిచిన తర్వాత రాష్ట్రం లో పెను మార్పులు వస్తాయి'' అన్నారు. 

''టీఆరెఎస్ పార్టీలోకి పోయిన వాళ్లకు ఇంకో పది మందిని తీసుకురమ్మని టార్గెట్ పెడుతున్నారు. నా కోసం మీటింగ్ పెడితే వాళ్ళను బెదిరిస్తున్నారు. నక్సలైట్ల లాగా లోపల లోపల మీటింగ్ పెట్టుకోవలసి వస్తుంది. వేరే పార్టీ లు వద్దనుకున్నప్పుడు భూమి మీద పుడితే గులాబీ పార్టీలో ఉండాలని ఒక చట్టం తీసుకు రా. టీఆరెఎస్ పార్టీ కి హుజూరాబాద్ లో డిపాజిట్ కూడా రాదు ఇంటలిజెన్స్ రిపోర్ట్ కూడా నమ్మే పరిస్థితి లో కేసీఅర్ లేడు'' అంటూ ఈటల రాజేందర్ మండిపడ్డారు.