నిజామాబాద్ సహ పరిసర ప్రాంతాల్లో  ఇవాళ  ఉదయం  భూకంపం  సంబవించింది.  రిక్టర్ స్కేల్ పై  భూకంప తీవ్రత  3.1 గా  నమోదైంది. 


నిజామాబాద్: నిజామాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆదివారం నాడు ఉదయం భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రత నమోదైంది. భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భయంతో స్థానికులు పరుగులు తీశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో భూ ప్రకంపనాలు ఇటీవల కాలంలో ఎక్కువగా నమోదౌతున్నాయి. భూకంపాలు ఎందుకు నమోదౌతున్నాయనే విషయమై అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. 2022 డిసెంబర్ 6వ తేదీన జహీరాబాద్ మండలం బిలాపూర్ లో భూకంపం చోటు చేసుకుంది. భారీ శబ్దంతో భూమి కంపించడంతో స్థానికులు భంయంతో పరుగులు తీశారు. రామగుండం, మంచిర్యాల, కరీంనగర్ లలో 2021 అక్టోబర్ 2న భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత 4.0 గా నమోదైంది. 2022 అక్టోబర్ 15న ఆదిలాబాద్ జిల్లాలో భూకంపం వాటిల్లింది.2021 నవంబర్ 1న తెలంగాణ రాష్ట్రంలోని కుమరంభీమ్ జిల్లా , మంచిర్యాల జిల్లాలో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి.ఈ ఏడాది నవంబర్ 29న ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో భూకంపం వాటిల్లింది. 2.5 తీవ్రతతో భూకంపం వచ్చింది.