Telangana Budget 2024-25 : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం

2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. శాసనమండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 
 

dy cm mallu bhatti vikramarka presents telangana budget 2024 in legislative assembly ksp

2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్‌ను భట్టి ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.29,669 కోట్లు . శాసనమండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం :

  • తెలంగాణ సమాజం మార్పును కోరుకుంది
  • అందరం కోసం మనమందరం అనే స్పూర్తితో ముందుకెళ్తున్నాం
  • సమానత్వమే మా ప్రభుత్వ లక్ష్యం
  • మార్పును కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారు
  • తెలంగాణ ప్రజలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు
  • మాది ప్రజల ప్రభుత్వం
  • తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చాం
  • గత ప్రభుత్వ పథకాలు గొప్ప.. అమలు దిబ్బ
  • గత ప్రభుత్వాల అప్పులు అభివృద్ధి అడ్డంకి కాదు
  • అప్పులను అధిగమించి అభివృద్ధిలో ముందడుగు వేస్తాం
  • గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రంలోనూ ఆర్ధిక కష్టాలు 
  • సంతులిత వృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
  • ఆర్భాటాలు, ఆకర్షణలకు దూరంగా ప్రభుత్వం
  • వర్షాభావం వల్ల పంట దిగుబడులు బాగా తగ్గాయి
  • ప్రజావాణి నిర్వహణకు ప్రత్యేక అధికారిగా సీనియర్ ఐఏఎస్‌ను నియమించాం
  • ప్రజావాణిలో 2 నెలల్లో వచ్చిన దరఖాస్తులు 43,054
  • ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు 14,951
  • భూ సమస్య కోసం వచ్చిన దరఖాస్తులు 8,927
  • పింఛన్ కోసం వచ్చిన దరఖాస్తులు 2,267
  • ఉద్యోగ కల్పన కోసం వచ్చిన దరఖాస్తులు 3,134
  • దరఖాస్తుల పరిష్కారం కోసం కలెక్టర్లు, శాఖాధిపతులకు పర్యవేక్షణ బాధ్యత
  • రుతుపవనాల ప్రభావం ఆర్ధిక వ్యవస్ధలో తీవ్రంగా వుంది
  • వ్యవసాయ రంగంలో క్షీణత ప్రజల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది
  • ఆహార పంటలు, వాణిజ్య పంటల్లో దిగుబడులు తగ్గాయి
  • ఆరు గ్యారంటీల అమలు ప్రభుత్వ తొలి ప్రాధాన్యత
  • ఆరు హామీల అమలులో లబ్ధిదారుల ఎంపిక వేగంగా సాగుతోంది
  • అర్హులైన అందరికీ ఆరు హామీలు అందుతాయి. 
  • మహాలక్ష్మీ పథకం కోసం ఆర్టీసీకి ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తోంది
  • ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధులు ఏర్పాటు చేస్తున్నాం
  • గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
  • త్వరలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం
  • దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి
  • పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ మరింత అభివృద్ధి
  • రెండు లెదర్ పార్కులు ఏర్పాటు చేస్తాం
  • రాష్ట్రం నలుమూలలా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం
  • డ్రైపోర్టులను అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్ ప్రణాళిక
  • గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృత్రిమ మేథ ఉపయోగిస్తాం
  • ఐటీ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం నూతన పాలసీ
  • ఐటీని రాష్ట్ర నలుమూలలకు విస్తరించేందుకు ప్రణాళికలు
  • ఐటీ విస్తరణకు అమెరికాలోని ఐటీ సర్వ్ సంస్థతో సంప్రదింపులు
  • దేశంలోనే అత్యంత పటిష్టమైన ఫైబర్ నెట్‌వర్క్ కనెక్షన్లు వుండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం
  • మిషన్ భగీరథ కోసం రూ.35,752 కోట్లు ఖర్చు చేసినట్లు గత ప్రభుత్వం చెప్పింది
  • వేల కోట్లు ఖర్చు చేసినా నేటికీ సురక్షిత నీరు లేని గ్రామాలెన్నో వున్నాయి 
  • గత ప్రభుత్వ తప్పుడు నివేదికల వల్ల కేంద్రం నుంచి మనకు హక్కుగా రావాల్సిన నిధులు రాలేదు
  • గ్రామీణాభిృద్ధిలో పదేళ్లలో చోటు చేసుకున్న తప్పులను సరిదిద్దుతాం
  • మిషన్ భగీరథలో లోపాల దిద్దుబాటుకు చర్యలు తీసుకుంటాం
  • ఆర్ధిక వనరులు వృథా కాకుండా చర్యలు
  • గ్రామీణాభివృద్ధిలో పదేళ్లలో చోటు చేసుకున్న తప్పులను సరిదిద్దుతాం
  • స్థానిక సంస్థలకు హక్కులను తిరిగి అందిస్తాం
  • గ్రామ పంచాయతీలకు ఆర్ధిక వెసులుబాటు కల్పిస్తాం
  • గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తాం
  • గ్రామ పరిపాలనా వ్యవస్ధను తిరిగి ప్రజల చేతుల్లో పెడతాం
  • పాలనాపరంగా అన్ని సంస్థలు, వ్యవస్ధలను ప్రక్షాళన చేస్తాం
  • మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా మార్చేందుకు కార్యాచరణ
  • మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ద్వారా మూసీ ప్రక్షాళన
  • హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా అభివృద్ధి చేస్తాం
  • అర్బన్ జోన్‌గా ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతం
  • పెరి అర్బన్ జోన్‌గా ఓఆర్ఆర్ - ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతం
  • గ్రామీణ జోన్‌గా ఆర్ఆర్ఆర్ అవతలి ప్రాంతం
  • గత ప్రభుత్వ రైతుబంధుతో అనర్హులే ఎక్కువగా లాభం పొందారు
  • కొండలు, గుట్టలు, రోడ్లకు కూడా రైతుబంధు సాయమిచ్చారు
  • పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేల్ సంస్థలకు రైతుబంధు ఇచ్చారు
  • అనర్హులకు రైతుబంధు ఇవ్వడం అక్రమం
  • రైతుబంధు నిబంధనలను పున: సమీక్ష చేస్తాం 
  • రైతుభరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం
  • కౌలు రైతులకు రైతుభరోసా ఇచ్చేందుకు మార్గదర్శకాలు
  • త్వరలో నూతన విత్తన విధానం
  • ప్రతి పంటకు మద్ధతు ధర కల్పిస్తాం
  • ధరణి కొందరికి భరణం. మరికొందరికి ఆభరణం.. చాలామందికి భారం
  • ధరణి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యత
  • ప్రధాని పసల్ బీమా ఆధారంగా రాష్ట్రంలో సమగ్ర పంటల బీమా
  • రెవెన్యూ వ్యవస్ధ ప్రక్షాళనకు సత్వర చర్యలు
  • ధరణి పోర్టల్ సమస్యల అధ్యయనానికి కమిటీ వేశాం
  • గత పదేళ్లలో పేదలు, ధనికులకు మధ్య అంతరం పెరిగింది
  • గురుకుల పాఠశాలలకు వసతులతో కూడిన సొంత భవనాలు
  • అన్ని గురుకుల పాఠశాలల్లో అందుబాటులోకి సౌర విద్యుత్
  • ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.1000 కోట్లు
  • ఎస్టీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.250 కోట్లు
  • గురుకుల పాఠశాలల సొసైటీ ద్వారా 2 ఎంబీఏ కళాశాలలు 
  • బీసీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.1546 కోట్లు
  • అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు
  • అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం
  • రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా చేయడమే మా లక్ష్యం
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు
  • ప్రతి మండలానికి అంతర్జాతీయ ప్రమాణాలతో పబ్లిక్ స్కూల్
  • తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు రూ.500 కోట్లు
  • ఉన్నత విద్యామండలి సంపూర్ణ ప్రక్షాళనకు కృషి
  • వర్సిటీల మౌలిక సదుపాయాల కోసం రూ.500 కోట్లు
  • నిమ్స్ విస్తరణకు నిధులు కేటాయిస్తాం
  • ఉద్యోగాల నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభించాం
  • త్వరలో 15 వేల మంది కానిస్టేబుల్ నియామకం పూర్తి
  • త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం
  • టీఎస్‌పీఎస్సీ నిర్వహణ, అదనపు సిబ్బంది నియామకానికి రూ.40 కోట్లు విడుదల చేశాం
  • గిగ్ వర్కర్ల సంక్షేమానికి సామాజిక భద్రత స్కీమ్ కింద రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నాం
  • రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తాం
  • 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు సత్వర చర్యలు
  • ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.7,740 కోట్లు
  • ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేనివారికి ఇళ్ల స్థలాలు
  • స్థలాలు వున్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం
  • ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు 
  • నీటిపారుదల రంగంలో తప్పిదాలు ప్రగతికి అవరోధాలుగా మారాయి
  • నీటి పారుల రంగ నిపుణుల సలహాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు
  • తమకు తెలిసిందే వేదమంటూ గత ప్రభుత్వం వ్యవహరించింది
  • పదేళ్ల ఒంటెద్దు పోకడతో సాగునీరు , ఆర్ధిక రంగాలు అతలాకుతలమయ్యాయి
  • కాంట్రాక్టుల కోసం ప్రాజెక్ట్‌లు నిర్మించే విధానంగా శాపంగా మారింది
  • రూ.లక్షల కోట్ల ఖర్చులో అవినీతి తేల్చాల్సిన బాధ్యత మాపై పడింది
  • కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై విచారణకు కార్యాచరణ
  • కృష్ణా , గోదావరి జలాల్లో వాటా సాధనకు రాజీలేని పోరాటం
  • రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్తాం
  • నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్లను పూర్తి చేస్తాం 
  • ఆదిలాబాద్ సహా ఎగువ జిల్లాలకు సాగునీరు అందించడమే లక్ష్యం
  • తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్ట్‌లను సత్వరమే పూర్తి చేస్తాం
  • కృష్ణా పరీవాహక ప్రాంత ప్రాజెక్ట్‌లకు అధిక ప్రాధాన్యం
  • ఏఎంఆర్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్ మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సత్వరమే పూర్తి 
  • నెట్టెంపాడు ఎత్తిపోతల రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం సత్వరమే పూర్తి
  • కోయిల్ సాగర్ ఎత్తిపోతలను త్వరలోనే పూర్తి చేస్తాం
  • రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
  • రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు
  • మూలధన వ్యయం రూ.29,669 కోట్లు
  • ద్రవ్యలోటు రూ.32,557 కోట్లు
  • రెవెన్యూ లోటు రూ.5,944 కోట్లు
  • ఆరు గ్యారంటీల కోసం రూ.53,196 కోట్లు
  • వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు
  • ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1250 కోట్లు
  • పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు
  • ఐటీ శాఖకు రూ.774 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం రూ.21,874 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం రూ.13,013 కోట్లు
  • పంచాయతీరాజ్ శాఖకు రూ.40,080 కోట్లు
  • మున్సిపల్ శాఖకు రూ.11,692 కోట్లు
  • మైనారిటీ సంక్షేమం కోసం రూ.2,262 కోట్లు
  • వైద్య రంగానికి రూ.11,500 కోట్లు
  • విద్యుత్ గృహ జ్యోతిపథకానికి రూ.2,418 కోట్లు
  • విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు
  • బీసీ సంక్షేమానికి రూ.8000 కోట్లు
  • విద్యా రంగానికి రూ.21,389 కోట్లు
  • మూసీ ప్రాజెక్ట్‌కు రూ.1000 కోట్లు


 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios