Asianet News TeluguAsianet News Telugu

సూప‌ర్ స్టార్ ర‌జినీ ఇంట్లో ఘ‌నంగా ద‌స‌రా వేడుక‌లు.. నవరాత్రి పూజాలో పాల్గొన్న గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

Superstar Rajinikanth: సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఇంట్లో న‌వ‌రాత్రి-ద‌స‌రా వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ప్రతి సంవత్సరం నవరాత్రులను పురస్కరించుకుని నటుడు రజినీకాంత్ ఇంట్లో ఘనంగా పండుగను జరుపుకుంటారు. రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ ఈ ఏడాది కూడా నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో వీవీఐపీలను కూడా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే న‌వ‌రాత్రి పూజా కార్య‌క్ర‌మంలో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌంద‌ర‌రాజ‌న్ పాలుపంచుకున్నారు. వీరితో పాటు అనేక మంది సినీ తార‌లు, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు. 
 

Dussehra celebrations at Superstar Rajinikanth's house; Governor Tamilisai Soundararajan participates in Navratri puja RMA
Author
First Published Oct 25, 2023, 10:17 AM IST

Navratri celebrations: సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఇంట్లో న‌వ‌రాత్రి-ద‌స‌రా వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ప్రతి సంవత్సరం నవరాత్రులను పురస్కరించుకుని నటుడు రజినీకాంత్ ఇంట్లో ఘనంగా పండుగను జరుపుకుంటారు. రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ ఈ ఏడాది కూడా నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో వీవీఐపీలను కూడా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే న‌వ‌రాత్రి పూజా కార్య‌క్ర‌మంలో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌంద‌ర‌రాజ‌న్ పాలుపంచుకున్నారు. వీరితో పాటు అనేక మంది సినీ తార‌లు, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు.

ర‌జినీకాంత్ నివాసంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం ఆయన ఇంట్లో నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘ‌నంగా జరుపుకుంటారు. ఈ ఏడాది జ‌రిగిన న‌వ‌రాత్రి వేడుక‌ల కోసం లతా రజినీకాంత్ విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వీవీఐపీలను ఆహ్వానించ‌గా, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్, సోదరి సెల్వి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, నటుడు విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, ఐఏఎస్ అధికారి రాధాకృష్ణన్, నటి మీనా తదితరులు హాజరయ్యారు. మరికొంత మంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

అయితే, భిన్నాభిప్రాయాలు ఉన్న వివిధ పార్టీల‌కు చెందిన రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఇంట్లో ద‌స‌రా న‌వ‌రాత్రి వేడుక‌ల‌కు హాజ‌రుకావ‌డం, అందరూ క‌లిసి ఫోటోలు దిగుతూ, సెల్ఫీలు దిగుతూ ఆనందించారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లిన రజనీ ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios