దుబ్బాక ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం, కత్తితో దాడి...
ఎన్నికల ప్రచారంలో ఉన్న దుబ్బాక ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఓ వ్యక్తి కడుపులో కత్తితో పొడిచాడు. ఎంపీకీ కడుపులో గాయం అయ్యింది.
సిద్దిపేట : మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశాడో యువకుడు. దౌలతాబాద్ లో ఎన్నికల ప్రచారంలో ఉండగా రాజు అనే వ్యక్తి ఎంపీ కడుపుతో కత్తితో దాడి చేశాడు. వెంటనే గమనించిన బీఆర్ఎస్ కార్యకర్తలు అతడిని చితకబాది, పోలీసులకు అప్పగించారు.
ఈ దాడిలో ఎంపీకి కడుపుభాగంలో గాయం అయ్యింది. ఆయనను ఆయన వాహనంలోనే ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కొత్త ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో కత్తితో దాడి చేయడానికి కారణం ఏంటో తెలియరాలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.