లక్షలాది మంది నిరుద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగ భర్తీ సంబంధించి మంత్రి సబిత ఇంద్రారెడ్డి కీలక ప్రకటన  చేశారు.

తెలంగాణ ఉపాధ్యాయ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉపాధ్యాయ భర్తీకి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ (TRT) సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మొత్తం 5130 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రత్యేక పాఠశాలల్లో 1523 పోస్టులను భర్తీ చేయనట్లు తెలిపారు. రెండు రోజులలో పూర్తి నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. విద్యారంగంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred