Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ గొప్పలు ఆపు.. 9 రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ ఉంది: డీకే అరుణ

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ ఫైరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల నియోజకవర్గంలోని కేటీదొడ్డి మండలంలో ఆమె పర్యటించారు. 

DK Aruna comments on KCR
Author
Gadwal, First Published Nov 26, 2018, 12:04 PM IST

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ ఫైరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల నియోజకవర్గంలోని కేటీదొడ్డి మండలంలో ఆమె పర్యటించారు.

ఈ సందర్భంగా స్థానిక శివాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెట్టెంపాడు నీటితో శివుని అభిషేకం చేసిన అరుణ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.  మిషన్ భగీరథ పేరు చెప్పి కేసీఆర్ కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను నాలుగేళ్లలో అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దేనని అరుణ ఎద్దేవా చేశారు.

మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఏమైందన్నారు... ఒక్క తెలంగాణలోనే 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లుగా కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని.. కానీ  తొమ్మిది రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ ఉందని అరుణ వ్యాఖ్యానించారు.

సోనియా గాంధీపై అడ్డగోలుగా మాట్లాడిన కేసీఆర్ నోరు అదుపులో ఉంచుకోవాలని ఆమె హెచ్చరించారు. మంత్రి హరీశ్ రావుకి నాలుగేళ్లుగా గద్వాల అభివృద్ధి కనిపించలేదా అని అరుణ ప్రశ్నించారు. కేవలం అబద్ధాలు చెప్పేందుకే గద్వాల వస్తున్నారని అరుణ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios