Asianet News TeluguAsianet News Telugu

పాక్ ప్రధానికి ఆర్జీవీ కౌంటర్.. మూడు పెళ్లిళ్లు ఎలా అంటూ

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి.. రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు.

director RGV counter tweets to pakistan PM imran khan
Author
Hyderabad, First Published Feb 21, 2019, 9:44 AM IST

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి.. రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేధికగా.. ఇమ్రాన్ ఖాన్ పై విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 43మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకుందామంటూ పాక్ ప్రధాని అన్న వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

మాటలతో అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని మీరు భావించినప్పుడు.. మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం ఎలా వచ్చిందంటూ సెటైర్ వేశారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ని రచయిత కోన వెంకట్ తెలుగులోకి అనువదించడం విశేషం.

ఇక మరో ట్వీట్ లో వర్మ.. ‘‘ ఒక వ్యక్తి టన్నుల కొద్ది ఆర్డీఎక్స్ తో మా వైపు పరిగెత్తుకొస్తున్నప్పుడు అతనితో ఎలా చర్చలు జరపాలో మా మూగ భారతీయులకు కొంచెం చెప్పండి. ఊరికే ఏమీ వద్దు. భారతీయులందరం మీకు మీ ట్యూషన్ టీచర్ కు ఫీజు చెల్లిస్తాం. మీ దేశంలో ఎవరు(ఒసామా బిన్ లాడెన్) నివసిస్తున్నారనేది అమెరికాకు తెలుస్తుంది. కానీ మీ దేశంలో ఎవరు నివసిస్తున్నారనేది మీకు తెలియదు. అసలు మీది నిజంగానే ఓ దేశమేనా? ఓ మూగ భారతీయుడ్ని అడుగుతున్నాను. దయచేసి నన్ను కొంచెం ఎడ్యుకేట్ చేయండి సర్.’’ అంటూ ట్వీట్ చేశారు.

‘‘ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తోయిబా, తాలిబన్, ఆల్ ఖైదా మీ ప్లేస్టేషన్లు అని నాకు ఎవరూ చెప్పలేదు, కానీ మరు కూడా వాటిపై ప్రేమ లేదనే విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. జైషే మహ్మద్, లష్కరే తోయిబా, తాలిబన్, ఆల్ ఖైదాలను మీరు బంతులుగా భావించి, పాకిస్తాన్ బౌండరీలు దాటిస్తూ భారత పెవిలియన్ లోకి కొడుతున్నారు. కానీ మీరు వాటిని క్రికెట్ బాల్స్ అనుకుంటున్నారా లేక బాంబులు అనుకుంటున్నారో కాస్త చెప్పాలి. దయచేసి మాకు తెలివితేటలు నేర్పండి సర్’’ అంటూ ఆర్జీవీ వ్యంగాస్త్రాలు విసిరారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios