జూబ్లీహిల్స్: యూసఫ్ గూడలోని మంత్రి కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి మాగంటి గోపీనాథ్ తరపున ప్రచారం చేసేందుకు మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో నేపథ్యంలో యూసఫ్ గూడలో స్థానిక నేత సతీష్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదం కాస్త పెద్దది కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 

సతీష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కేటీఆర్ రోడ్ షో వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సతీష్ రెడ్డిని అరెస్ట్ చెయ్యకుండా పోలీసులను అడ్డుకున్నారు. 

టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కు మేయర్ సర్ధిచెప్పారు. అటు సతీష్ రెడ్డికి కూడా బొంతు రామ్మోహన్ సర్ది చెప్పారు. అయితే బొంతు రామ్మెహన్ రంగంలోకి రావడం, సర్ధిచెప్పడంతో మాగంటి గోపీనాథ్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో కేటీఆర్ రోడ్ షో నుంచి నుంచి అలిగి వెళ్లిపోయారు.