ధరణి వెబ్ సైట్‌లో తప్పులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా వనపర్తి జిల్లాలో 43 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తికి సంబంధించిన భూమిని కొందరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వనపర్తి జిల్లాలో రెవెన్యూ అధికారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. చనిపోయిన రైతు పోలాలను ఇతరులకు పట్టా చేశారు. 43 ఏళ్ల క్రితం చనిపోయిన దేవుల బుచ్చన్నకు చెందిన ఆరు ఎకరాల భూమిని ఇతరులకు పట్టా చేశారు. ఈ వ్యవహారంలో అమరచింత తహసీల్దార్ సింధూజ పాత్ర వుందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇందులో తమ పోరపాటు ఏం లేదని.. తహసీల్దార్ సమర్ధించుకుంటున్నారు. 2017కి ముందే బుచ్చన్న పేరు నుంచి పట్టా మార్పిడి జరిగిందంటున్నారు. దీనికి సంబంధించి ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 43 ఏళ్ల క్రితం మరణించిన తమ తాత ఎప్పుడు వచ్చాడు.. తన పేరిట వున్న భూమిని తమకు కాకుండా వేరే వాళ్లకి ఎలా రిజిస్ట్రేషన్ చేశాడని బుచ్చన్న మనవడు వెంకటన్న అధికారులను నిలదీస్తున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
