దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య.. తండ్రి మృతితో మనస్తాపంతో.. పెట్రోల్ కొనుక్కొచ్చుకుని...
ఖమ్మంలో ఓ కాలేజీలో మెడికల్ డెంటల్ కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.
ఖమ్మం : ఆదివారం సాయంత్రం ఖమ్మంలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉండి డెంటిస్ట్ గా చదువుకుంటున్న ఓ మెడికల్ స్టూడెంట్ మంటల్లో కాలిపోతూ కనిపించింది. అది గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను రక్షించడానికి ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. చివరికి ఆమె మరణించింది. అయితే ఆమె మృతి పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు ప్రాథమిక ఆధారాలను బట్టి మానసది ఆత్మహత్య కావచ్చని భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఖానాపూర్ హవేలీ సిఐ శ్రీహరి మానస మృతికి సంబంధించిన ఘటన వివరాలను ఇలా తెలిపారు.. సముద్రాల మానస (22) వరంగల్ లోని పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీలో బీడీఎస్ లాస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో కాలేజీ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది. హాస్టల్ లోనే నాలుగో అంతస్తులు ఉన్న ఓ గదిలో మానస ఒంటరిగానే ఉంటుంది.
పొంగులేటి మా పార్టీలోకి రావాలి.. గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం పదవి: కేఏ పాల్
ఆదివారం సాయంత్రం.. ఏదో కాలిపోతున్న వాసన వస్తుండడంతో హాస్టల్ నిర్వాహకులు ఇతర విద్యార్థులు.. కంగారుపడి ఎక్కడ నుంచి వస్తున్నాయో వెతికారు. ఆ పొగలు మానస గదిలో నుంచే వస్తుండడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు.. మానస గది తలుపులు పగలగొట్టారు. లోపలికి వెళ్ళగా అప్పటికే మంటల్లో చిక్కుకొని మానస కాలిపోతు కనిపించింది.
వెంటనే నీళ్లు పోసి కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయగా అక్కడికి హుటాహుటిన వారు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే హాస్టల్లో నీకు కొంతమంది ఈ కాలిపోయే ముందు మానస గది నుంచి కేకలు వినిపించాయని చెబుతున్నారు.
దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తులో భాగంగా.. హాస్టల్, దాని చుట్టుపక్కల ఉన్న సిసిటీవీ కెమెరాలను పరిశీలించారు. వీటిల్లో హాస్టల్ సమీపంలోని ఓ బంకు నుంచి ఆమె పెట్రోల్ కొనడం రికార్డు అయింది. వాటిని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇటీవలే మానస తండ్రి మృతి చెందాడు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. తరచూ తండ్రిని తలుచుకుని బాధపడుతుండదట.
అంతేకాదు రెండు మూడు రోజులుగా తన తోటి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కూడా మాట్లాడి వచ్చినట్లు సమాచారం. కాగా, ఈ ఘటన మీద తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు అంటున్నారు. వరంగల్ లో ఉన్న మృతురాలి బంధువులకు సమాచారం అందించామని.. వారు రావాల్సి ఉందని సీఐ తెలిపారు. మానసది ఆత్మహత్యగానే భావిస్తున్నామంటున్నారు పోలీసులు. గదిలో ఎలాంటి ఉత్తరం దొరకలేదని చెప్పారు.