కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లోని సుభాష్‌ పత్రి ధ్యాన శిబిరంలో భక్తురాలు మృతి చెందింది. ప్రపంచ ధ్యాన శిబిరంలో భాగంగా హాజరైన ఓ భక్తురాలు నోట్లో నురగలు కక్కుతూ చనిపోవడం సంచలన కలిగిస్తోంది. పిరమిడ్ ఆశ్రమంలో మృతి చెందిన మహిళ గుంటూరు జిల్లా పెరిగవలపూడి గ్రామానికి చెందిన 35ఏళ్ళ కళ్యాణిగా గుర్తించారు. 

కళ్యాణి మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేమాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  

గతంలో పిరమిడ్ మార్గ సిద్ధాంత కర్త సుభాష్ పత్రిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ధ్యానం ముసుగులో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రచారం జరిగింది. సుభాష్ పత్రి స్త్రీలోళుడు అంటూ విమర్శలు ఎదుర్కొన్నారు కూడా. గతంలో ఆయన శిష్యుడు వెంకట రమణ దారుణ హత్యకు గురయ్యారు. 

భక్తిపేరుతో సుభాష్ పత్రి రక్తిలీలలు నడుపుతున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పిరమిడ్ లో భూతుభాగోతం, బయట భూ భాగోతాలు నడుపుతున్నారంటూ ప్రచారం జరిగింది. ప్రతి ఇంటిని ధ్యాన కేంద్రంగా చేయడం పిరమిడ్‌ సాధకుల ముందున్న ఏకైక లక్ష్యమంటూ చెప్పుకునే సుభాష్ పత్రి అనేక అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ కేసులు కూడా నమోదయ్యాయి.