హైదరాబాద్: తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో అమానవీయమైన, అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. కన్నకూతురిపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని ఓ గ్రామంలో ఆ సంఘటన చోటు చేసుకుంది. తాండూరు గ్రామీణ ఎస్ఐ సంతోష్ శుక్రవారం అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక తల్లి పదేళ్ల క్రితం మరణించింది. ఆ తర్వాత తండ్రి (37) మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. కూతురును దోమ మండలంలోని ఓ ప్రార్థనా పాఠశాలలో చదివిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా మార్చిలో కూతురు ఇంటికి వచ్ిచంది. 

కామంతో కళ్లు మూసుకుపోయిన అతను రంజాన్ పర్వదినం రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిపై అత్యాచారం చేశాడు. విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దాంతో తన బాధను ఆమె సవతి తల్లితో కూడా చెప్పుకోలేకపోయింది. 

రెండు రోజుల క్రితం కూతురుని హైదరాబాదులోని పెద్దమ్మ ఇంటికి పంపింంచాడు. దాంతో తండ్రి చేసిన దారుణాన్ని పెద్దమ్మకు బాధితురాలు చెప్పింది. ఆమె ఊరికి చేరుకుని విషయాన్ని బాలిక నాయనమ్మకు చెప్పింది. వారు బాలిక తండ్రిని నిలదీశారు. 

ఆ తర్వాత అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం బాలికను జిల్లా ఆస్పత్రికి పంపించారు.