హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టులతో సమానమని సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  మద్యం సేవించి వాహనాలు నడిపివారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే పదేళ్ల పాటు జైలు శిక్ష తప్పదని ఆయన చెప్పారు. నగరంలో వాహనాల తనిఖీని మళ్లీ ప్రారంభించామన్నారు.

also read:హైద్రాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం: సజ్జనార్

మద్యం తాగి వాహనాలు నడిపుతూ సోమవారం నాడు ఒక్క రోజే 402 మంది తమకు పట్టుబడ్డారని ఆయన చెప్పారు.  లిక్కర్ సేవించి వాహనాలు నడిపే వారెవరైనా వదలిపెట్టబోమని ఆయన తేల్చి చెప్పారు.కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

పబ్లిక్ గాను ఇతర ప్రాంతాల్లో కూడ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించవద్దని ఆయన కోరారు.  గేటెడ్ కమ్యూనిటీలలో కూడా న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.