Asianet News TeluguAsianet News Telugu

తీన్మార్ మల్లన్నకు నోటీసులు.. కేసీఆర్ కు రాజకీయ సమాధి కడతానంటూ హెచ్చరిక..

పీర్జాదిగూడ లోని సంస్థ కార్యాలయంలో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు మొత్తం 12 హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షల నిమిత్తం రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్ లాబరేటరీ పంపనున్నారు. నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఆధారాలను బట్టి న్యాయస్థానానికి నివేదిక అందజేస్తారు.

cyber crime police  notices to Q news owner teenmaar mallanna alias chintapandu naveen
Author
Hyderabad, First Published Aug 5, 2021, 9:43 AM IST

యూ ట్యూబ్‌ ఛానల్‌ క్యూ న్యూస్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఆ సంస్థ మాజీ ఉద్యోగి ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా పరిగణిస్తూ సి ఆర్ పి ఎస్ 41ఎ సెక్షన్ కింద వీటిని ఇచ్చారు. 

పీర్జాదిగూడ లోని సంస్థ కార్యాలయంలో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు మొత్తం 12 హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షల నిమిత్తం రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్ లాబరేటరీ పంపనున్నారు. నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఆధారాలను బట్టి న్యాయస్థానానికి నివేదిక అందజేస్తారు.

తన కార్యాలయంలో సోదాల మీద తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిప్పులు చెరిగాడు. వరంగల్ అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ ను వరంగల్లోనే రాజకీయ సమాధి కడతారని తీన్మార్ మల్లన్న హెచ్చరించాడు. కెసిఆర్ 400 మంది పోలీసులతో తన ఆఫీసులో తనిఖీలు చేయించాడని.. అయితే పోలీసులు తనిఖీలు చేయాల్సింది ఆయన ఫాంహౌస్లో అని చెప్పాడు. యువతితో ఫిర్యాదు విషయంలో కెసిఆర్ త్వరలోనే ఫూల్ కాబోతున్నాడని ఎద్దేవా చేశాడు.

వరంగల్ ను తెలంగాణ రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశాడు. హుజురాబాద్ లో టిఆర్ఎస్ కు ఓటమి తప్పదని హెచ్చరించాడు. తీన్మార్ మల్లన్న న్యూస్ యూట్యూబ్ ఛానల్ కార్యాలయంలో హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం రాత్రి 8:30 గంటలకు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్ లో హార్డ్ డిస్క్ లను సీజ్ చేశారు.

తీన్మార్ మల్లన్నపై సోమవారం ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఆఫీసులో సోదాలు నిర్వహించారు అని అంటున్నారు. దాంతోపాటు చిలకలగూడ పోలీస్ స్టేషన్లో  తీన్మార్ మల్లన్న పై నమోదైన మరో కేసు దర్యాప్తులో భాగంగా అక్కడి పోలీసులు సైతం 41 ఎ నోటీసులు అందజేశారు. కేసు దర్యాప్తునకు సహకరించాలని సాక్షులను ప్రభావితం చేయొద్దని నోటీసులో పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios