తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా నిందితులు కుంట శ్రీనివాస్‌, చిరంజీవి, కుమార్‌ను పోలీసులు స్పాట్‌లోకి తీసుకెళ్లారు.

ఘటనాస్థలిలో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ కేసులో ఏ1గా గుంజపడుగుకు చెందిన కుంట శ్రీనివాస్‌, ఏ2గా విలోచవరానికి చెందిన శివందుల చిరంజీవి, ఏ3గా గుంజపడుగుకు చెందిన అక్కపాక కుమార్‌(44)లను చేర్చారు. నిందితులపై ఐపీసీ 302, 341, 120బి రెండ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు వామనరావు దంపతుల హత్య కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించే అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్‌లో ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా చూసేందుకు కేసును సీఐడీకి బదిలీ చేయడమే ఉత్తమమని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.

మరోవైపు వామన్‌రావు, నాగమణిల దారుణ హత్యపై రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల ఆందోలనలు రెండోరోజు కొనసాగుతున్నాయి. న్యాయవాదుల హత్యలను ఖండిస్తూ రెండవ రోజు విధులు బహిష్కరించి, కోర్టుల ముందు నిరసనకు దిగారు లాయర్లు.