హైదరాబాద్: హైద్రాబాద్ టోలిచౌకి వద్ద  ఫ్లైఓవర్ నిర్మాణంలో  అపశృతి చోటు చేసుకొంది. ఫ్లై ఓవర్ పనుల సమయంలో భారీ క్రేన్  రోడ్డుపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరోకరు గాయపడ్డారు. 

టోలిచౌకి- మెహిదీపట్నం మార్గంలోని షేక్‌పేట నాలా సమీపంలో  భారీ క్రేన్‌ ఫ్లైఓవర్‌ నుండి కిందకు ఒరిగిపోయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడిని ఆసుపత్రికి తరలించారు.

మెట్రో రైల్వే‌కు సపోర్ట్ కోసం మరో పిల్లర్ నిర్మాణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.  ఓవర్ లోడ్ కారణంగా క్రేన్ రోడ్డుపై ఒరిగిపోయింది.మెహిదిపట్నం నుండి గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ, హైటెక్ సిటీకి  వెళ్లాలంటే ఈ మార్గం ప్రధానమైంది. ఐటీ కారిడార్‌కు వెళ్లాలంటే ఇదొక ప్రధాన మార్గం.

క్రేన్ కుప్పకూలడంతో  ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామైంది. దీంతో  వేరే మార్గంలో  ట్రాఫిక్‌ను  మళ్లించారు.