సెప్టెంబర్ 6వ తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నట్టు  ప్రకటించారు.ఈ మేరకు అధికారికంగా సమాచారం వచ్చింది


హైదరాబాద్: సెప్టెంబర్ 6వ తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నట్టు ప్రకటించారు.ఈ మేరకు అధికారికంగా సమాచారం వచ్చింది.ఈ మీడియా సమావేశంలోనే అభ్యర్థుల జాబితాను కూడ ప్రకటించే అవకాశం లేకపోలేదనే సమాచారం కూడ ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే కేబినెట్ సమావేశం ముగించుకొని గవర్నర్ కలిసిన తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ భవన్ కు చేరుకొంటారు. అక్కడ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయమై కేసీఆర్ మీడియాకు వివరించనున్నారు. 

మరో వైపు ఇవాళ సుమారు 50 మంది అభ్యర్థుల పేర్లను కూడ కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.లేదా తొలి విడత జాబితా పేరుతో కొందరు అభ్యర్ధుల పేర్లను కూడ ప్రకటించే అవకాశం ఉంది. 

2014 ఎన్నికల సమయంలో కేసీఆర్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సీటు నుండి జీవన్ రెడ్డి పేరును ప్రకటించారు. ఈ దఫా జీవన్ రెడ్డి పేరుతోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారా.. లేక మరోకరి పేరుతో జాబితా ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది,.