హైద్రాబాద్ పెద్ద అంబర్‌పేటలో  గంజాయితో పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లకు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది కోర్టు. 2020లో పెద్ద అంబర్ పేట వద్ద 1335 కిలోల గంజాయితో నిందితులు పోలీసులకు చిక్కారు.

హైదరాబాద్: హైద్రాబాద్ అంబర్ పేటలో Ganjaతో పట్టుబడిన ఇద్దరికి కోర్టు గురువారం నాడు 20 ఏళ్ల Jail శిక్షను విధించింది.2020లో Hyderabad కు సమీపంలోని Pedda Amberpet వద్ద 1335 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో పోలీసులు కోర్టుకు సమర్పించిన సాక్ష్యాల మేరకు ఇద్దరు నిందితులు మహ్మద్ హమీద్, రామేశ్వర్ లకు శిక్ష విధించింది కోర్టు. 20 ఏళ్లు పాటు జైలు శిక్ష విధించాలని ఇవాళ కోర్టు తీర్పు చెప్పింది.

రాష్ట్రంలో డ్రగ్స్ తో పాటు గంజాయి సరఫరా చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామని సీఎం KCR ప్రకటించారు. పోలీసులు, ఎక్సైజ్ శాఖాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి మత్తు పదార్ధాల రవాణ, సరఫరాకు చెక్ పెట్టాలని సీఎం ఆదేశించారు. నార్కోటిక్ వింగ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. డ్రగ్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో గత వారంలోనే బీటెక్ విద్యార్ధి మరణించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లక్ష్మీపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

మరో వైపు పంజాబ్ రాష్ట్రం నుండి కారు చౌకగా డ్రగ్స్ ను తీసుకొచ్చి హైద్రాబాద్ లో సరఫరా చేస్తున్న ఇద్దరు సభ్యులను గత మాసంలో రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ, 3 కోట్లకు పైగా ఉంటుందని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఇదిలా ఉంటే మరో వైపు హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని పుడింగ్ మింక్ పబ్ లో డ్రగ్స్ లభ్యం కావడం కలకలం రేపుతుంది. ఈ విషయమై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ పబ్ పై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ సీఐ నాగేశ్వరరావునే బంజారాహిల్స్ సీఐగా నియమించారు. హైద్రాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో కూడా మత్తు పదార్ధాలు రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసకొంటామని పోలీసు శాఖ హెచ్చరించింది.

డ్రగ్స్, గంజాయి సరఫరా చేసే వారిపై తెలంగాణ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైద్రాబాద్ నగరంలో పోలీసులు డ్రగ్స్ తో పాటు గంజాయి సరఫరా చేయకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నారు. మత్తు పదార్ధాలు విక్రయించే వారితో పాటు వీటిని కొనుగోలు చేసే వారిపై కూడా తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. హైద్రాబాద్ సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతానని హెచ్చరించారు. హైద్రాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీవీ ఆనంద్ దేశంలో హైద్రాబాద్ సహా పలు నగరాలకు డ్రగ్స్ సరఫరా చేసే మోస్ట్ వాంటెడ్ టోనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో ఉన్న టోనిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. టోని ఇచ్చిన సమాచారం మేరకు డ్రగ్స్ తీసుకుంటున్న వ్యాపారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.గంజాయితో పాటు డ్రగ్స్ విషయమై పోలీసులు, ఎక్సైజ్ శాఖ సీరియస్ గా తీసుకొంది. మత్తు పదార్ధాలను సరఫరా చేసే వారిపై ఇటీవల కాలంలో నిఘాను పెంచింది.