సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు ఓ కార్యకర్త. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని అభిమానించేవారి సంఖ్య చాలా ఎక్కువే ఉంటుంది. అయితే.. ఆ అభిమానాన్ని చాటుకునే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. కాగా.. సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు ఓ కార్యకర్త. 

గణపురం మండలంలోని బస్వరాజుపల్లికి చెందిన గడ్డం గణేష్‌, సుమలత అనే దంపతులు తమ 25రోజుల కుమారుడికి స్పీకర్‌ మధుసూదనాచారి చేత నామకరణం చేశారు. తన మొదటి కుమార్తెకు సిరికొండ వర్తించేలా పేరు మాన్యసిరి అని దంపతులు పేరు పెట్టుకుంటే రెండవ సంతానం అయిన కుమారుడికి చిన్న కేసీఆర్‌ అని స్పీకర్‌ మధుసూదనాచారి పేరు పెట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. 

కాగా... గణేష్ కుటుంబానికి పండుగ బట్టలకు రూ.5వేలను స్సీకర్ ఆర్థికసాయం చేశారు. దీంతో దంపతులు హర్షం వ్యక్తం చేశారు.