Asianet News TeluguAsianet News Telugu

నిన్న పాజిటివ్.. నేడు నెగిటివ్.. కరోనా ఫలితం తారుమారు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ(65)కు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా.. ఈ నెల 21న పాజిటివ్ గా తేలింది.

coronavirus result manipulated in 24 hours in rangareddy
Author
Hyderabad, First Published Jun 24, 2020, 10:59 AM IST

కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్ పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల కరోనా ఫలితాల విషయంలో గందరగోళం నెలకొంది. ఓ మహిళకు 24గంటల వ్యవధిలో ఒకసారి కరోనా పాజిటివ్ రాగా.. మరోసారి నెగిటివ్ వచ్చింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ(65)కు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా.. ఈ నెల 21న పాజిటివ్ గా తేలింది. వెంటనే వైద్యాధికారులు, పంచాయతీ పాలకవర్గం సదరు గ్రామంలో కంటెయిన్ మెంట్ జోన్ కి తరలించారు.

అయితే.. ఆమెకు ఎలాంటి లక్షణాలు లేకుండా పాజిటివ్ రాకపోవడంతో అనుమానంతో మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. కాగా ఆ పరీక్షలో ఆమెకు నెగిటివ్ అని తేలింది. కేవలం 24గంటల్లో ఫలితం మారిపోయింది. కాగా.. దీనిపై అధికారిక సమాచారం రాలేదని మండల వైద్యాధికారిణి డా.రోహిణి తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios