తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 20 వేల మార్కును దాటింది. హైదరాబాదులో ఎప్పటిలాగే కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 2751 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 20 వేల 126కు చేరుకుంది. హైదరాబాదులో ఎప్పటిలాగే 400కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో గత 24 గంటల్లో 432 పాజిటివ్ కేసుు నమోదయ్యాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 9 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 808కి చేరుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 89350 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. తెలంగాణలో ఇంకా 30008 యాక్టివ్ కేసులున్నాయి.

జిల్లాలవారీగా తెలంగాణలో గత 24 గంటల్లో నమోదైన కేసులు

ఆదిలాబాద్ 30
భద్రాద్రి కొత్తగూడెం 72
జిహెచ్ఎంసీ 432
జగిత్యాల 88
జనగామ 42
జయశంకర్ భూపాలపల్లి 14
జోగులాంబ గద్వాల 39
కామారెడ్డి 65
కరీంనగర్ 192
ఖమ్మం 132
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 14
మహబూబ్ నగర్ 64
మహబూబాబాద్ 75
మంచిర్యాల 86
మెదక్ 35
మేడ్చెల్ మల్కాజిగిరి 128
ములుగు 22
నాగర్ కర్నూలు 54
నల్లగొండ 147
నారాయణపేట 16
నిర్మల్ 43
నిజామాబాద్ 113
పెద్దపల్లి 97
రాజన్న సిరిసిల్ల 48
రంగారెడ్డి 185
సంగారెడ్డి 42
సిద్ధిపేట 96
సూర్యాపేట 111
వికారాబాద్ 17
వనపర్తి 63
వరంగల్ రూరల్ 30
వరంగల్ అర్బన్ 101
యాదాద్రి భువనగిరి 58
మొత్తం కేసులు 2751

Scroll to load tweet…