హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ ప్రజలంతా ఒక్క తాటిపైకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు స్వచ్ఛందంగా కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. ఆరోగ్యంతో ఆటలు వద్దు ప్రయాణంతో ప్రమాదం తెచ్చుకోవద్దని మోడీ ఇచ్చిన పిలుపుతో అందరూ స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆటో టు వీలర్ ఫోర్ వీలర్ ఆర్టీసీ బస్సు అన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి

హైదరాబాదులో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇమ్లిబన్ లో కొంత మంది ఆటవిడుపుగా క్రికెట్ ఆడుతుండడం కనిపించింది. ట్యాంక్ బండ్ నిర్మానుష్యంగా కనిపిస్తోంది. పోలీసులు గస్తీ తిరుగుతున్నారు.

Also read: గోదావరిఖనిలో ఇద్దరికి కరోనా సోకినట్లు ప్రచారం... ఐదుగురు యువకులు అరెస్ట్

కరీంనగర్లో జనతా కర్ఫ్యూ ఉదయం నుంచి కొనసాగుతోంది ప్రజలు స్థానికులు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ లో పాల్గొంటున్నారు. పోలీసులు రాత్రి వేల నుంచి అలర్ట్ అయ్యారు కరీంనగర్లో ఇండోనేషియా నుంచి వచ్చిన పదిమందికి కరోనా పాజిటివ్ రావడంతో కరీంనగర్లో స్వచ్ఛందంగా కర్ఫ్యూ లో పాల్గొంటున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో రెండో అతి పెద్ద బస్టాండు పేరుగాంచిన కరీంనగర్ బస్టాండ్ లో ఎమర్జెన్సీ కోసం అధికారులు ఐదు బస్సులను ఏర్పాటు చేశారు. కరీంనగర్ బస్ డిపో పరిధిలో ఉన్న 880 బస్సులు డిపో కే పరిమితమయ్యాయి. కరీంనగర్ బస్టాండ్ పరిధిలో పోలీసులు రవాణాశాఖ అధికారులు వచ్చే వాహనాలను ప్రత్యేకంగా ఏం చేస్తున్నారు.జనతా కర్ఫ్యూలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి గారు కమిషనరేట్ లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ బందోబస్తును పర్యవేక్షించారు.

Also read: విజృంభిస్తున్న కరోనాపై పోరాటం... తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనతా కర్హ్యూ  సందర్భంగా వేములవాడ పట్టణంలో స్వచ్ఛందంగా ప్రజలు బంద్ పాటిస్తిన్నారు. మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. బస్సులు ఎక్కడికక్కడ ఆగేపోయాయి.

జగిత్యాలలో జనతా కొనసాగుతోంది. అన్ని వాణిజ్య సంస్థలు, పెట్రోల్ పంపులు, కూరగాయల మార్కెట్, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రధాన కూడళ్లలో పోలీసుల గస్తీ తిరుగుతున్నాయి. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.

పెద్దపల్లి జిల్లా మంథనిలో జనత కర్ఫ్యూ అమలవుతోంది. ఈ  వాణిజ్య , వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఆర్టీసి బస్సులు రోడ్డెక్కలేదు. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.