Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ : గాలిలో 2 గంటల పాటు కరోనా.. సీసీఎంబీ, ఐఎంటెక్‌ అధ్యయనంలో వెల్లడి..

కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందా ? లేదా ? అనే అంశంపై సీసీఎంబీ, ఐఎంటెక్‌ సంయుక్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఉమ్మడిగా అధ్యయన వివరాలను సీసీఎంబీ మంగళవారం ప్రకటించింది.

Coronavirus Can Be Transiently Airborne In Certain Conditions : CCMB, IMTech Study - bsb
Author
hyderabad, First Published Jan 6, 2021, 3:03 PM IST

కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందా ? లేదా ? అనే అంశంపై సీసీఎంబీ, ఐఎంటెక్‌ సంయుక్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఉమ్మడిగా అధ్యయన వివరాలను సీసీఎంబీ మంగళవారం ప్రకటించింది.

ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని 3 ఆస్పత్రులు, చండీగఢ్‌లోని 3 ఆస్పత్రుల్లోని కొవిడ్‌ వార్డుల్లోని గాలి నమూనాలను అధ్యయనం చేశామని, వాటిలోని గాలిలో కరోనా వైరస్‌ కణాలను గుర్తించామని స్పష్టంచేసింది. అయుతే కరోనా వైరస్‌  గాలిలో కొంతసేపే ఉంటోందన్నారు.

కరోనా వైరస్ కు గాలి ద్వారా వ్యాప్తి చెందే స్వభావం ఉందని హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) వెల్లడించింది. వైరల్‌ లోడ్‌ ఎక్కువగా ఉన్న కరోనా రోగులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే నీటితుంపరల ద్వారా వైరస్‌ 2 మీటర్ల దూరం దాకా ప్రయాణిస్తున్నట్లు గుర్తించామని, వైరల్‌ పదార్థాలు గాలిలో 2 గంటల వరకు చైతన్యంగా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

వ్యక్తుల్లో ఇన్ఫెక్షన్‌ లక్షణాలు తక్కువగా ఉన్నప్పుడు ఫ్యాన్లు, ఏసీల ద్వారా గాలి విస్తరించని పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తి పరిమితంగా ఉందని సీసీఎంబీ, చండీగఢ్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైక్రోబయల్‌ టెక్నాలజీ (ఐఎంటెక్‌)ల సంయుక్త అధ్యయనంలో తేలిందన్నారు.

రోగుల అటెండెంట్లు తప్పనిసరిగా మాస్క్‌ను ధరించడం ద్వారా వైరస్‌ నుంచి రక్షణ పొందొచ్చని తెలిపారు. కరోనా లక్షణాలు అధికంగా ఉన్న వ్యక్తుల్ని కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని నిరోధించగలమని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న వారు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదని, వారు ప్రజల్లో తిరగకుండా, ఐసొలేషన్‌లో ఉంచితే వైర్‌సను కట్టడి చేయవచ్చని ఆయన సూచించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios