Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా... కరీంనగర్ కు కేసీఆర్

తెలంగాణలో కరోనా వైరస్ అంతకంతకు విజృంభిస్తుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా వున్న కరీంనగర్ లో పర్యటించడానికి సిఎం సిద్దమయ్యారు. 

Corona Virus Effect... Telangana CM KCR Karimnagar Tour
Author
Karimnagar, First Published Mar 20, 2020, 3:28 PM IST

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య ఒక్క తెలంగాణలోనే 16కు చేరింది. దీంతో రాష్ట్ర ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మరీముఖ్యంగా కేవలం ఒక్క కరీంనగర్ పట్టణంలోనే ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో అక్కడ ప్రజలకు మనోధైర్యాన్ని అందించడమే కాదు కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం కరీనంగర్ పట్టణంలో పర్యటించనున్నారు. 

ఇండోనేషియా నుంచి కరీంనగర్ నుంచి వచ్చిన కొద్దిమందికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో అధికార యంత్రాంగం పట్టణంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కూడా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పలు సూచనలు చేస్తూ వచ్చారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారికి తప్ప, స్థానికులెవరికీ వ్యాధి సోకకుండా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయి.  

read more  కరోనాకు బ్లీచింగ్... కరీంనగర్ లో పరిస్థితి ఇది: మంత్రి గంగుల

కరీంనగర్ లో పరిస్థితిని స్వయంగా పరిశీలించి, పర్యవేక్షించేందుకు శుక్రవారమే ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లో పర్యటించాలని భావించారు. కానీ శుక్రవారం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ఉండడంతో ఈ పర్యటన శనివారానికి వాయిదా పడింది. సిఎంతో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కూడా కరీంనగర్ లో పర్యటిస్తారు. అక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. 


 

Follow Us:
Download App:
  • android
  • ios