తెలంగాణలో నేడు, రేపు కరోనా వాక్సినేషన్ నిలిపివేత

తెలంగాణలో నేడు, రేపు కరోనా వాక్సినేషన్ ను నిలిపేస్తున్నట్లు డిహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. వ్యాక్సినేషన్ మార్గదర్శకాల కేంద్రం జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది.

Corona vaccination will not be there in Telangana today and tommarrow

హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు అంటే శనివారం, ఆదివారం కరోనా వాక్సినేషన్ ను నిలిపేసారు. కోవీషీల్డ్ తొలి, రెండో డోసుల మధ్య వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. 

రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న కరోనా వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను నేడు, రేపు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కోవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు 12 నుంచి 16 వారాల వ్యవధిలో ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ రద్దు చేసింది. ఈ నెల 17వ తేదీన తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. 

కోవిషీల్డ్ టీకా తీసుకున్నవారికి మొదటి డోసు తర్వాత 12 వారాలు దాటినాక రెండో డోసు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు కొవిషీడ్ల్ టీకా రెండో డోసును 6.8 వారాల తర్వాత ఇస్తూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల నేపథ్యంలో శని, ఆదివారాలు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ను నిలిపేస్తున్నట్లు ఆరోగ్య శాఖ డైరెక్టర్ జి. శ్రీనివాస రావు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios