Asianet News TeluguAsianet News Telugu

రాజధాని ఎక్స్ ప్రెస్ రైల్లో కరోనా అనుమానితులు: వినకుండా ఢిల్లీకి పయనం

వికారాబాద్ వైద్యులు చెప్పినా వినకుండా ఇద్దరు కరోనా వైరస్ అనుమానితులు రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులో ఢిల్లీకి బయలుదేరారు. వారి చేతికి ఉన్న స్టాంపులు చూసి గుర్తు పట్టి గాంధీకి తరలించారు.

Corona suspects found in Rajadhani express
Author
Hyderabad, First Published Mar 21, 2020, 2:53 PM IST

వరంగల్: హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్సప్రెస్ లో ఇద్దరు కరోనా అనుమానిత ప్రయాణికులు కనిపించారు. ఏప్రిల్ 5 తేదీ వరకు ఎక్కడికి వెళ్లొద్దని వికారాబాద్ వైద్యులు హెచ్చరించారు. అయినా వైద్యుల మాట వినకుండా ఢిల్లీకి రవి, పూజ అనే ఇద్దరు బయలుదేరారు. వారి చేతికి డాక్టర్లు వేసిన మార్క్.. చూసి  తోటి ప్రయాణికులు గుర్తు పట్టారు. 

కాజిపేట్ రైల్వే స్టేషన్ లో వారిద్దరిని దింపి అంబులెన్సు లో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రైల్వే పోలీసులు తరలించారు. రవి , పూజ లు ప్రయాణిస్తున్న కోచ్ బీ-3లోని ప్రయాణికులను మరో బోగిలోకి మార్చారు. బీ -3 కోచ్ ను అధికారులు పూర్తిగా శానిటైజ్ చేశారు. అది ఢిల్లీకి తిరిగి బయలుదేరింది.

వరంగల్ జిల్లాలో కరోనా అనుమానితుల జంట బయటపడింది. నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న జంటకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన విషయం తెలిసిందే. దాంతో కాజీపేటలో నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ ను ఆపేశారు. నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ రైల్లోని ప్రయాణికులు, రైల్వే అధికారులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. వారిద్దరిని వరంగల్ లోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. 

ఇదిలావుంటే, ఖమ్మం జిల్లాలో మథిర వద్ద కృష్ణా ఎక్స్ ప్రెస్ ఐదో బోగీలో ప్రయాణిస్తున్నవారికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానించారు. దాంతో రైలును ఆపేసి శానిటైజ్ చేసి తర్వాత కదిలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios