పెద్దపల్లి జిల్లా బసంత నగర్ టోల్ ప్లాజా సిబ్బందిపై కరోనా పంజా విసిరింది. టోల్ ప్లాజాలో పదిమందికి పాజిటివ్ రావడంతో భయాందోళనకు గురి అవుతున్న టోల్ ప్లాజా సిబ్బంది.

"

పెద్దపల్లి జిల్లా రాజీవ్ రహదారి పై గల బసంత్ నగర్ టోల్ గేట్ మీద కరోనా పంజా విసిరింది సిబ్బందిలో 10 మంది వరకు  కరోనా బారిన పడ్డట్టు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు ఉద్యోగులు కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స  పొందుతున్నారు, 

కరోనా బారిన పడినవారిలో వాహనాల నుండి డబ్బులు  వసూలు చేసే సిబ్బంది మొదలు సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు, ఇన్చార్జిలు ఉన్నారు. దీంతో సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. సిబ్బందిలో బసంత్ నగర్ పరిసర గ్రామాలకు చెందినవారే చాలామంది  ఉన్నారు. 

మొదట ఒక ఉద్యోగికి పాజిటివ్ రాగా, అతనితో రెండు కుటుంబాలు పాజిటివ్ కు గురైనట్లు తెలుస్తోంది. బసంత్ నగర్ టోల్ ఫ్లాజా సిబ్బందిపై కరోనా ప్రభావం పడడంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. 

ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి రవాణా పెరగడం, ఇసుక క్వారీలు నడుస్తుండటంతో టోల్ గేట్ వద్ద వాహనాల తాకిడి కూడా ఎక్కువైంది. అయితే టోల్గేట్ నిర్వాహకులు దీనిని పెద్ద సమస్యగా గుర్తించక పోవడంతో సమస్య వచ్చిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. 

ఇప్పటికైనా టోల్ గేట్ నిర్వాహకులు అప్రమత్తం కాకపోతే సిబ్బందితో పాటు వాహనదారులకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు.