నిజామాబాద్:  కరోనా లాక్‌డౌన్  కారణంగా నెల్లూరులో చిక్కుకుపోయిన తన కొడుకును స్వంత ఊరుకు తీసుకొచ్చేందుకు ఓ తల్లి తీవ్రంగా కష్టపడింది. స్కూటీపై 700 కి.మీ. దూరం వెళ్లి తన కొడుకును ఇంటికి తీసుకొచ్చింది.తన కొడుకును స్కూటీపై నెల్లూరు నుండి బోధన్ కు తీసుకొచ్చింది తల్లి. కొడుకు కోసం ఆమె స్కూటీ పై 1400 కి.మీ ప్రయాణం చేసింది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన రజియా బేగం ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. కొడుకు, కూతురు ఉన్నారు. ఆమె భర్త 12 ఏళ్ల క్రితమే మరణించాడు. రజియా కూతురు పెద్దది, చిన్నవాడు నిజాముద్దీన్ ఇంటర్ పూర్తి చేసి హైద్రాబాద్ నారాయణ మెడికల్ అకాడమీలో కోచింగ్ తీసుకొంటున్నాడు. 

నిజాముద్దీన్ స్నేహితుడు కూడ బోధన్ లో ఇంటర్ చదివాడు. అతడు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల కోసం బోధన్ వచ్చాడు. నిజాముద్దీన్ స్నేహితుడి తండ్రి ఆరోగ్యం బాగా లేదని సమాచారం రావడంతో  మార్చి నెల 12వ తేదీన వీరిద్దరూ కలిసి నెల్లూరుకు వెళ్లారు. 

కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ కావడంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంది. దీంతో నెల్లూరులో ఉన్న తన కొడుకును బోధన్ కు రప్పించేందుకు తల్లి రజియా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు.

దీంతో బోధన్ ఏసీపీ జైపాల్ రెడ్డిని కలిసి తన పరిస్థితిని వివరించింది రజీయా బేగం. తనకు నెల్లూరు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరింది. దీంతో ఆయన ఆమెకు అనుమతిస్తూ లేఖను ఇచ్చాడు.ఈ లేఖను తీసుకొని 700 కి.మీ దూరంలోని నెల్లూరుకు చేరుకొంది. ఈ నెల 6వ తేదీన ఉదయం ఆమె బోధన్ నుండి బయలుదేరింది. పోలీసుల సహాయంతో ఆమె కొన్ని చోట్ల విశ్రాంతి తీసుకొంది. మంగళవారం నాడు మధ్యాహ్నం నెల్లూరుకు చేరుకొంది. 

నెల్లూరులో కొడుకును కలిసింది. అదే స్కూటీపై ఆమె మంగళవారం నాడు నెల్లూరు నుండి బయలుదేరింది.  బుధవారం నాడు మధ్యాహ్నం ఆమె కామారెడ్డికి చేరుకొంది. బోధన్ నుండి నెల్లూరుకు వెళ్లే మార్గమధ్యలో పలు చోట్ల పోలీసులు నిలిపివేశారని ఆమె గుర్తు చేసుకొన్నారు. అయితే తన కొడుకును తీసుకొచ్చేందుకు నెల్లూరు వెళ్తున్నట్టుగా బోధన్ ఏసీపీ ఇచ్చిన అనుమతి పత్రం చూపడంతో పోలీసులు కూడ ఆమెకు అనుమతి ఇచ్చారు.

నెల్లూరులో ఉన్న తన కొడుకును తీసుకొని ఎట్టకేలకు ఆమె బుధవారం నాడు రాత్రి ఇంటికి చేరుకొంది.  రాత్రి, పగలు తేడా లేకుండా ఆమె స్కూటీపై ప్రయాణం చేసింది. అంతేకాదు